Oscar and Guinness

Dr.Sagi Satyanarayana is a very accomplished doctor.

He has been accomplished for writing 72 books in a year.

Internationally recognized for his meritious work and has received various Awards.

Dr. Sagi Satyanarayana's talents in various fields have been recognized at the international level. The Oscar organization showered praises on him as Bharat Pratibharatna. Mentioning the names of the books written by him on various topics, this award was announced at a program held in Australia on December 25, 2020. To this end, Gawli, director of Oscar World Records, sent a document.

Many people can have talent. But extraordinary wisdom is an irrevocable gift from God. It belongs to only a few people. Dr. Sagi Satyanarayana, a resident of Malkajgiri, belongs to that category. While continuing as a doctor, he wrote 180 books in Telugu and English languages on spirituality, medicine, astrology, yoga and other topics in three decades. So far three Guinness records have been achieved through these. The first Guinness record was received on January 28, 2016 and the second one came in August of the same year. The third Guinness record was achieved on October 3, 2019. A person can earn one or two doctorate degrees in his lifetime. And getting 33 doctorates is nothing but God's Grace and Sadhana. Dr. Sagi Satyanarayana holds the highest number of 108 doctorates from many universities around the world. In this 12 Doctor of Science, 25 Doctor of Literature and 71 Doctor of Philosophy have been awarded. All this was achieved in just 41 years. He has written a maximum of 180 books so far. He has a total of 108 doctorates. He became the greatest person who has achieved the highest number of doctorates in the world.

All this was completed between 1980 and 2021. Currently, he is acting as the Vice Chancellor of two universities. One of them is Maharishi Vedavyasa International Vedic University which is based in Gujarat. On 15th February 2020, Dr. Sagi was appointed as the "Vice-Chancellor" by the University. He is also serving as the Vice-Chancellor of the University of Microbiology, Gujarat.

A series of records and awards

In 2011, Srimad Hanumad Bhagavatam written by Dr. Sagi Satyanarayana was recognized as the best book by the Delhi Telugu Society. A cash prize was awarded for this. On the occasion of Gurupurnima, Dr. Sagi Satyanarayana was felicitated with a gold bracelet by Sai organizations in a program held on November 15, 2013 at Ravindra Bharati, Hyderabad.

On 16th August, 2018, Jyotishya Vishwavidypeeth, Nagpur Center, awarded the gold medal for outstanding excellence in astrology in Maryland, USA. 2018 13th March Telangana Govt... awarded Bharat Pratibharatna Puraskar. On October 21, 2019, Doctor Sagi's name was entered in the book of Fantastic World Records. In the same year, he got a place in the Limca Book of World Records. In the same year, the name was recorded in the Inspiring Book of World Records on 12th December. On September 15, 2020, the World Constitution and Parliament Association presented an award to Dr. Sagi Satyanarayana. On March 3, 2021, he received a certificate from the World Book of Records, an organization based in England. In the same month, the Telangana Government not only presented the Nandi Award but also honored it for the year 2020-21.

This honor came in the context of becoming the person with the highest number of doctorates in the world. knowledge of Brahman. He received a certificate of appreciation from the University of Ujjain, Madhya Pradesh for writing. On March 21 this year, the Thana Sansthan honored him with a Gandapenderam. Recently the book Sanatana Dharma written by Dr. Sagi Satyanarayana has gained international popularity.

Telugu:


అటు అస్కార్ ఇటు గిన్నిస్

అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ

ఏడాది కాలంలో 72 గ్రంథాలు రచించిన వైనం

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభకు పట్టం

వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభాపాఠవాలకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు లభించింది. భారత ప్రతిభారత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావిస్తూ 2020. డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రకటించింది.ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ డైరెక్టర్ గావ్లీ ఓ పత్రం పంపారు.

ప్రతిభ అనేకమందికి ఉండొచ్చు. అయితే అసాధారణ ప్రజ్ఞ అనేది దేవుడిచ్చిన ఓ తిరుగులేని వరం. అది అతకొద్దిమందికే సొంతం. ఆ కోవకే చెందుతారు మల్కాజ్‌గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనారాయణ. వైద్యుడిగా కొనసాగుతూనే మూడు దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిష్యం,యోగ తదితర అంశాలపై తెలుగు ఆంగ్ల భాషల్లో 180 పుస్తకాలు రచించారు. వీటిద్వారా ఇప్పటివరకు మూడు గిన్నిస్ రికార్డులను దక్కించుకున్నారు. తొలి గిన్నిస్ రికార్డును 2016 జనవరి 28న అందుకోగా రెండోది అదే ఏడాది ఆగస్టులో వచ్చింది. మూడో గిన్నిస్ రికార్డును 2019 అక్టోబర్ 3వ తేదీన దక్కించుకున్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒకటి లేదా రెండు డాక్టరేట్ పట్టాలను సాధించగలుగుతాడు. మరి 33 డాక్టరేట్లు పొందడం అంటే దేవుడి కృప, సాధన తప్ప మరొకటి కానేకాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలనుంచి అత్యధికంగా 108 డాక్టరేట్లను పొందారు డాక్టర్‌ సాగి సత్యనారాయణ. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్ 12, .. డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు 25తోపాటు 71 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలను దక్కించుకున్నారు. ఇదంతా కేవలం 41 ఏళ్ల వ్యవధిలోనే సాధించారు. ఇప్పటివరకు అత్యధికంగా 180 గ్రంధాలను రచించారు. మొత్తం 108 డాక్టరేట్లను ఆయన సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లను సాధించిన గొప్ప వ్యక్తిగా నిలిచారు.

1980 నుంచి మొదలుకుని 2021 మధ్య కాలంలో ఇదంతా పూర్తయింది. ప్రస్తుతం రెండు యూనివర్సిటీలకు ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి గుజరాత్ కేంద్రంగా పనిచేసే మహర్షి వేదవ్యాస ఇంటర్నేషనల్ వేదిక్ విశ్వవిద్యాలయం. 2020 ఫిబ్రవరి 15వ తేదీన డాక్టర్ సాగిని ఈ విశ్వవిద్యాయం "ఉపకులపతిగా నియమించింది. గుజరాత్ లోని మైక్రోబయాలజీ విశ్వవిద్యాలయానికి కూడా ఆయన వైస్‌ చాన్సలర్‌ గా పనిచేస్తున్నారు.

రికార్డులు, పురస్కారాల పరంపర

2011లో డాక్టర్ సాగి సత్యనారాయణ రచించిన శ్రీమద్ హనుమద్ భాగవతం పుస్తకాన్నిఢిల్లీ తెలుగు సంఘం అత్యుత్తమ పుస్తకంగా గుర్తించింది. ఇందుకుగాను నగదు బహుమతిని అందజేసింది. గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 2013 నవంబర్ 15న జరిగిన కార్య క్రమంలో సాయి సంస్థలు... డాక్టర్ సాగి సత్యనారాయణకు స్వర్ణ కంకణం తొడిగి... సత్కరించాయి.

అమెరికాలోని మేరీల్యాండ్‌ జ్యోతిష్యంలో అసాధారణ ప్రజ్ఞను గుర్తించిన నాగపూర్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం 2018 ఆగష్టు 16 స్వర్ణపతకం అందజేసింది. 2018 మార్చి 13వ తెలంగాణ ప్రభుత్వం... భారత ప్రతిభారత్న పురస్కారం అందజేసింది. 2019 అక్టోబర్ 21న ఫెంటాస్టిక్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో డాక్టర్ సాగి పేరు నమోదైంది. అదే ఏడాది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 12వ ఇన్ స్పైరింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పేరు నమోదైంది. 2020, సెప్టెంబర్ 15వ తేదీన వరల్డ్‌ కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ పార్లమెంట్‌ అసోసియేషన్...డాక్టర్‌ సాగి సత్యనారాయణకు పురస్కారం అందజేసింది. 2021 మార్చి 3వ తేదీన ఇంగ్లాండ్‌ కేంద్రంగా పనిచేసే వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. అదే నెల 2020-21 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు అవార్డు అందజేయడమే కాకుండా సత్కరించింది.

ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లు పొందిన వ్యక్తిగా నిలిచిన నేపథ్యంలో ఈ సన్మానం జరిగింది. బ్రహ్మజ్ఞానం. రచించినందుకుగాను, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ ఏడాది మార్చి 21వ తానా సంస్థ ఆయనకు గండపెండేరం తొడిగి సత్కరించింది. తాజాగా డాక్టర్‌ సాగి సత్యనారాయణ రచించిన సనాతన ధర్మం అనే పుస్తకానికి అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం లభించింది.